|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:52 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటూ జరగనున్నాయి. తొలిరోజు అసెంబ్లీ ముగిసిన తర్వాత ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగ్గా.. ఈ నెల 8 (గురువారం) వరకు సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి -25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్‌తో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. మరోవైపు ఏసీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది. అసెంబ్లీ బీఏసీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీఎల్పీలో నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యులు లేకుండా బీఏసీ సమావేశం జరిగింది. అంతకముందు అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగించారు.. సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
Latest News