|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:51 PM
ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్న రా.. కదలిరా సభాస్థలి దగ్గర కలకలంరేపింది. హెలిపాడ్ వద్ద మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేస్తుండగా ఒక్కసారిగా శబ్దం వెలువడింది. హెలిప్యాడ్ వద్ద సిగ్నల్ బజర్ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు.. బాంబు స్క్వాడ్ కూడా తనిఖీలు చేపట్టారు. శబ్దం వెలువడిన ప్రాంతంలో తవ్వగా ఇనుప రాడ్ బయటపడింది. దీంతో సిబ్బంది, టీడీపీ నేతలు ఊపరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు చింతలపూడికి బయల్దేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా అంటూ రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు చొప్పున భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకున్న టీడీపీ అధినేత.. మళ్లీ నేటి నుంచి సభలు ప్రారంభించారు. ఇవాళ ఉదయం మాడుగలలో ఒక సభ పూర్తికాగా.. రెండో సభను చింతలపూడిలో ఏర్పాటు చేశారు.