|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:34 PM
చీరాలకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చిన్నగంజాం వద్ద మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. చీరాలలోని స్వర్ణ గేటు వద్ద నివసించే ఆసాది స్వామి రెడ్డి(24) సొంత పనిపై ఒంగోలులో వెళ్లి బైకుపై తిరిగి వస్తూ చీకట్లో కనిపించక ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై శ్రీనివాసరావు చెప్పారు.
Latest News