|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 07:31 PM
చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎమ్. శివకుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు వీఆర్ లో ఉన్న ఆయనకు ఎన్నికల బదిలీలలో భాగంగా రూరల్పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోనని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఆయన తెలియజేశారు. సిబ్బంది అభినందనలు తెలిపారు.
Latest News