|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 04:08 PM
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంలో అబద్ధాలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందన్నారు.
గవర్నర్ ప్రసంగం అంకెల గారడీతో.. ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం రాసిచ్చిన అబద్దాలు చదవటానికి గవర్నర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానించారు.