|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 03:03 PM
తూర్పుగోదావరి: కుల పెద్దల మాట వినలేదని ఓ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఇది జరిగింది. నగేరు సుబ్బమ్మకు, నగేరు ఆంజనేయులు కుటుంబాలకు స్థలం సరిద్దుపై వివాదం ఏర్పడింది.
కుల పెద్దలు పంచాయితీ పెట్టి తీర్పు చెప్పారు. అది నచ్చని సుబ్బమ్మ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నాలుగు నెలలుగా తాము తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నామని బాధితులు వాపోతున్నారు.