|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 03:02 PM
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పత్రాలను చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. అంతా అంకెల గారడీ, అబద్దాలే ఉన్నాయని విమర్శించారు.
వాటిని చదవలేక గవర్నర్ కూడా నీళ్లు నమిలారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల్లో నంబర్ వన్‌గా నిలిపిన జగన్‌కు మరోసారి అధికారం అడిగే అర్హత లేదన్నారు.