|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:09 AM
సెల్ ఫోన్ షాపులో నగదును ఛోరీచేసిన సంఘటన రేపల్లె పట్టణంలోని లక్ష్మీటాకీసు సెంటరులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ అబ్దుల్ రజాక్ వివరాల మేరకు లక్ష్మీటాకీసు సెంటరులో తమ మోబైల్ దుకాణంలో దుండగులు ప్రవేశించిన రూ. 5వేల నగదును అపహరించినట్లు బాధితుడు ఎండీ ఖాసి ఫిర్యాదు చేశాడన్నారు. బాధితుడి పిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Latest News