|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 04:23 PM
ధర్మవరం పట్టణంలోని ఎల్ 3 కాలనీలో వృద్ధురాలు లక్ష్మీదేవి, కంటి చూపు లేని కూతురు రాజ్యలక్ష్మి కలసి జీవనం సాగిస్తున్నారు. వృద్ధురాలు లక్ష్మీదేవి జీవనోపాధికి తన ఆరోగ్యం సహకరించడం లేదని, శనివారం తారక్ చేయూత ట్రస్ట్ ను సంప్రదించడం జరిగింది. తక్షణమే స్పందించిన ట్రస్ట్ ప్రెసిడెంట్ అంకె రామంజి, తమ ట్రస్ట్ సభ్యులతో కలసి వృద్ధురాలు లక్ష్మీదేవికి తక్షణ సహాయంగా రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు.
Latest News