|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:47 AM
ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జల విలయం మహా విషాదాన్ని మిగిల్చింది. డెర్నా నగరంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారానికి 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేల మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న రెండు జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే.
Latest News