|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:21 AM
వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్కరి రూ.15 వేల చొప్పున అందజేయనున్నారు. 3,57,844 మంది లబ్ధిదారులకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది.
Latest News