|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 10:22 AM
కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇప్పటివరకూ ఆరుగురికి పాజిటివ్ రాగా, ఇద్దరు మృతి చెందారు. 1,080 మంది బాధితులతో కాంటాక్ట్ అయినట్లు గుర్తించిన అధికారులు వారందరినీ ఐసోలేషన్ లో ఉంచారు. మలప్పూర్, వయనాడ్, కన్నూర్, త్రిస్సూర్ ప్రాంతాలకూ వైరస్ విస్తరిస్తోంది. కోజికోడ్ లో ఈ నెల 24 వరకూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కాగా, కేరళలోనే ఈ వైరస్ ఎందుకు వ్యాపిస్తుందో తెలయలేదని ఐసీఎంఆర్ తెలిపింది.
Latest News