|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 04:39 PM
టీడీపీ - జనసేన కలవడం అనేది కొత్త కాదని.. తాను ఎప్పటి నుండో చెప్తున్నానని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ పార్టీ సింగిల్గానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ఎవరితో కలిసి వెళుతుందనేది ఆ పార్టీ నిర్ణయమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన ప్రజలు మద్దతు తమకే ఉందన్నారు. వాళ్ళు ఎంతమంది మంది వచ్చినా తమకేం భయం లేదని స్పష్టం చేశారు. ఆ కలయికనే తాము గుర్తించడం లేదన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు తన మీద చేయాలని కోరుతున్నానని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలు పెట్టిన కేసులని తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 90 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని.. పర్యావరణహితంగా పండగ జరుపుకోవాలని తమ ముఖ్య ఉద్దేశమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.
Latest News