|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 04:39 PM
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఉద్దేశ, కక్ష పూరితంగా జరిగిందని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుని అరెస్టు చేసిన తీరు తెలుగు ప్రజలను కలిచివేసిందన్నారు. జైల్లో చంద్రబాబుకు భద్రత లేదన్నారు. జెడ్ కేడర్‌లో ఉన్న నేతను క్రిమినల్స్ ఉన్న సెంట్రల్ జైల్లో ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలపటం అభినందనీయమన్నారు.
Latest News