|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 04:38 PM
ఈ రోజు నుంచి తెలుగుదేశం, జనసేన కలసి ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ శుక్రవారం నాడు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన కలిసి నిరసన తెలిపాయి. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2024 ఎన్నికలు తర్వాత టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మంత్రి రోజా వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. రోజా నీ గత చరిత్ర చెప్పమంటావా? చంద్రబాబు రాజకీయ భవిష్యత్తును ఇస్తే అదే చంద్రబాబు జైలుకెళ్తే నువ్వు స్వీట్లు పంచుతావా? ఆ రోజుల్లో నువ్వు అప్పుల పాలైపోతే ఆ అప్పులు తీర్చింది చంద్రబాబు కాదా? అని అయన ప్రశ్నించారు.
Latest News