|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:30 PM
శ్రీకాకుళం స్థానిక ఏడురోడ్ల కూడలి లో శుక్రవారం సుమారు ౩౦౦ మంది నిరుపేదలకు సామాజిక కార్యకర్త డా. అరికితోట కనకరాజు, ఉమా దంపతుల మనవడు ఏవి. సూర్యతేజ పేరు మీద అన్నవితరణ చేసారు. అనంతరం డా. కనకరాజు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, నిరుపేదలకుఅన్న వితరణ చెయ్యటం ఆనందంగా ఉందని, అన్నవితరణ ఆత్మ సంతృప్తినిస్తుందన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, పి. ఎన్ కాలనీ వారి సహకారంతో తయారుచేసిన అన్నప్రసాదాన్ని అందించామన్నారు.
Latest News