|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:45 PM
శ్రీ సత్యసాయి జిల్లా కొత్త రకం జ్వరం ప్రజల్లో కలకలం రేపుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరి మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కొత్త రకం జ్వరానికి సంబంధించి లక్షణాలు బయటకు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. ఈ జ్వరంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలి మరణం సంభవించింది. ధర్మవరం పోతుకుంటకు చెందిన యువకుడు గవ్వల మధు స్క్రబ్ టైఫన్ అనే ఈ క్రొత్త రకం జ్వరంతో మృతిచెందాడు. కొత్త రకం జ్వరంతో సత్య సాయి జిల్లా వైద్య అధికారులు అలెర్ట్ అయ్యారు. బెంగుళూర్ ఆస్పత్రి నివేదికను వైద్యాధికారులు పరిశీలిస్తున్నారు. తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టారు.
Latest News