|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:44 PM
సేవకు మారుపేరుగా నిలిచిన డాక్టర్ వేజళ్ల ప్రకాశరావు మృతి సమాజానికి తీరనిలోటని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. రేపల్లె పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన డాక్టర్ వేజళ్ల ప్రకాశరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Latest News