|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:43 PM
బొమ్మనహాళ్: మండలంలోని కొలగానహళ్లి పాము కాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. కుందుర్పి మండలం మందలపల్లి గ్రామానికి చెందిన కర్రెన్న (35) బొమ్మనహళ్ మండలం లింగదహాళ్ గ్రామంలో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం రైతు వెంకటరెడ్డి దానిమ్మ తోటలో పంట కోతకు పనుల్లో నిమగ్నమైనప్పుడు పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న తోటి కూలీలు బళ్లారి విమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
Latest News