|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 09:00 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఆయన రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లారు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిని లోకేష్ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంటులో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
Latest News