పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం అంతరాయం
by Suryaa Desk |
Thu, Sep 14, 2023, 08:50 PM
ఆసియా కప్ సూపర్-4లో నేడు భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్-శ్రీలంక జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 27 ఓవర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్‌కు కాసేపు విరామం ప్రకటించారు. 27.4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది. మ్యాచ్ ఫ్రారంభ సమయంలో కూడా వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు.
Latest News