అకస్మాత్తుగా జడ్జికి బందోబస్తు ఏమిటి..?
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:23 AM

న్యాయాధికారులు తప్పు తీర్పుఇస్తే దానిని ప్రశ్నించకూడదని ఏ రాజ్యాంగంలోనూ లేదు. ఇటువంటి పరిస్థితులలో న్యాయవ్యవస్థపై మాట్లాడకపోతే ఎలా? తీర్పు ఇచ్చిన జడ్జికి అకస్మాత్తుగా 4+4 గన్‌మెన్ల బందోబస్తు ఎందుకు ఇచ్చారో తెలియాలి అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జడ్జి కాల్‌ డేటాను బయట పెట్టాలని కోరారు. జడ్జిని ఎవరైనా బెదిరించారా, ఒత్తిళ్లు తెచ్చారా అని అనుమానాలున్నాయి. ఈ కేసులో ముగ్గురు జడ్జిల పాత్రపై విచారణ జరిపించాలి. నాకు ఎటువంటి శిక్ష విధించిన ఫరవాలేదు. కానీ ప్రజలకు నిజం తెలియాలని డిమాండ్‌ చేశారు. 

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM