|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:22 AM
చంద్రబాబు పర్యటనలు, ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓటమి భయంతోనే, సీఎం జగన్ అక్రమ అరెస్టుకు కుట్ర చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు, బాబు అభిమానులు పలు ప్రాంతాల్లో బుధవారం రోడ్లెక్కారు. నానక్‌రామ్‌గూడ ఐటీ జోన్‌లోని విప్రో సర్కిల్‌కు వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు చేరుకున్నారు. భారీగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘ఐయామ్ విత్ సీబీఎన్’ అని రాసి ఉన్న ప్లకార్డులను, బ్యానర్లను ప్రదర్శించారు. ‘వుయ్ వాంట్ జస్టిస్.. జై బాబు.. జై బాబు..’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు.
Latest News