|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:31 AM
రోడ్డు ప్రమాదంలో అంగన్వాడి ఆయా తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం ఉదయం ములకలచెరువు మండలంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు. మండలంలోని వేపూరికోట పంచాయతీ, రాజుగారిపల్లికి చెందిన అరవింద్ భార్య విజయలక్ష్మి (31), బైకులో అంగన్వాడి స్కూల్ వద్దకు వెళుతుండగా ఆటో అడ్డురావడంతో అదుపుతప్పి పడి తీవ్రంగా గాయపడింది. 108 సిబ్బంది బాధితురాలిని చికిత్సల కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Latest News