|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:02 PM
కర్నూల్ లో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ రాష్ట్ర వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని ట్రాన్స్ పోర్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబా పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ పట్టణంలో ఆటో కార్మికులతో ఆటో స్టాండ్ నందు కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి, ఆటో యూనియన్ నాయకులు రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.
Latest News