|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:00 PM
ఆత్మకూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కాలువపల్లి గ్రామంలో తులసి అనే వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News