|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:48 PM
16 నెలలు జైలులో ఉండి వచ్చిన క్రిమినల్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చంద్రబాబును జైలుకు పంపాలనే ఆలోచనతో ఉన్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..... స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి అంటూ జగన్ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అలాంటప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌లో పని చేసిన అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసులు పెట్టి జగన్ సునకానందం పొందుతున్నారని అన్నారు.
Latest News