|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:51 PM
చంద్రబాబు ఉన్న జైల్‌లో కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారని.. అక్కడ బాబుకి సేఫ్టీ లేదని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వాపోయారు. బాబుకు ఏమైనా జరిగితే... ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. మొద్దు శ్రీనును జైల్‌లోనే చంపేశారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ, ఇండియా కూటమి, జాతీయ నేతలు ఖండిస్తున్నారన్నారు. బాబు అరెస్టును సినిమా రంగానికి చెందిన వారు కూడా చాలా మంది ఖండిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టు చేసినప్పటి నుంచి టీడీపీ నేతలను వేధిస్తున్నారన్నారు.
Latest News