|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:45 PM
స్కిల్ డెవలప్మెంట్ గుజరాత్‌లో ఒప్పయింది.. ఏపీలో మాత్రం తప్పు ఎలా అవుతుంది..? అని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే ప్రోగ్రాం అమలు చేశారు. దిక్కుమాలిన నవరత్నాలు మా వాళ్లు పెట్టారు, సరిగా అమలు కూడా చేయలేరు. జగన్ 7వేల కోట్లు పెట్టీ మీటర్లు పెట్టారు, అందులో 3వేల కోట్లు కొట్టేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా2లక్షల 70 వేల మందికి ఉపాధి హామీని చంద్రబాబు కలిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో అసలు కుంభకోణం లేదు. రామతీర్థంలో రాముడి తల తీసేశారు, రథం మావాళ్లు తగలబెట్టారు. పిచ్చి పిచ్చి కేసులు పెట్టీ రాష్ట్రాన్ని తగలపెడుతున్నారు. ఇండియా బెస్ట్ స్టేట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అవార్డు కూడా జగన్ వచ్చిన కొత్తలో తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడును ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటీ అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.
Latest News