|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:42 PM
అఖిలపక్షంతో కలిసి వైసీపీ నేతలు వస్తే, రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు చూపిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. 2.13 లక్షల మంది శిక్షణ ఇచ్చిన వివరాలతో పాటు ఉద్యోగాలు పొందిన 74 వేల మంది వివరాలు ఇస్తామన్నారు. నిజమో కాదో తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. 40 కేంద్రాల ఏర్పాటు ఖర్చు నిజమైతే చంద్రబాబుకు నడిరోడ్డు మీద క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.371 కోట్ల చంద్రబాబు తినేస్తే... కేంద్రాల ఏర్పాటు ఖర్చు మంత్రుల తాతల సొత్తు తెచ్చి పెట్టారా అని ప్రశ్నించారు.
Latest News