|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 08:24 PM
మంగళవారం కొలంబో వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్ల ధాటికి టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా జట్టులో రోహిత్ శర్మ 53 పరుగులు, కేఎల్ రాహుల్ 39 పరుగులు, ఇషాన్ కిషన్ 33 పరుగులు, అక్షర్ 26 పరుగులు చేసారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ 5, అసలంక 4 వికెట్లు తీశారు.
Latest News