|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 07:37 PM
ఏపీ బీజేపీలో చాలామంది టీడీపీ కోవర్టులున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని తాము టీడీపీ కోవర్టుగానే భావిస్తున్నామని ఆయన అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ బంద్‌కు జనసేన మద్దతివ్వడంపై కూడా ఆయన స్పందించారు. జనసేన ప్రస్తుతం బీజేపీతో ఉందని, కానీ భవిష్యత్తులో టీడీపీతో కలుస్తుందనే అభిప్రాయం ఉందని చెప్పారు. అందుకే టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నారన్నారు.
Latest News