|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:45 PM
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు తప్పు చేశారనడం కేవలం జగన్ రెడ్డి కట్టుకథే అని టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపిన జగన్ రెడ్డి, మరోపక్క యథేచ్ఛగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లు, అధికారులతో కలిసి గ్రామాల్లోని టీడీపీ ఓట్లు తొలగించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. నిత్యం ప్రజలు, రాష్ట్రం గురించి ఆలోచించే చంద్రబాబుని ప్రజలకు దూరం చేయడం జగన్ రెడ్డి తరంకాదని తెలిపారు. దుర్మార్గపు ప్రభుత్వ దోపిడీ విధానాలు, అరాచకాల్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యవంతుల్ని చేయాలని తెలిపారు.
Latest News