|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:44 PM
వైసీపీ పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఎఎజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు.
Latest News