|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:43 PM
వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తుందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తెలియజేసారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌లను పాతాళానికి తొక్కేస్తామని.. తాము తలుచుకుంటే బతికి బట్టకట్టగలరా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడం ఏ రకంగా అర్థం చేసుకోవాలని మండిపడ్డారు. కొత్త అమావాస్య నాటికి టీడీపీ, జనసేన కనుమరుగై పోతాయని, లేకపోతే గుండు గీయించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ నెలరోజుల కిందట ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద వైసీపీ చాలా రోజులుగా కుట్ర చేస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు.
Latest News