|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:34 PM
విజయనగరం జిల్లా, రేగిడి మండలంలో సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్ళితే.... పెద్దశిర్లాం గ్రామానికి చెందిన కురిటి ప్రభాకర రావు (53) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం భారీవర్షం కురవటంతో సాయంత్రం వరి పొలం చూసేందుకు మేనల్లుడు నానితో కలిసి ప్రభాకరరావు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో పని చేస్తుండగా విషసర్పం కాటు వేసింది. గుర్తించిన కు టుంబసభ్యులు వెంటనే రాజాం ఆసుపత్రికి ఆటోలో తరలి స్తుండగా మార్గమధ్య లోనే తుదిశ్వాస విడిచాడు. ఈయనకు భార్య రేణిక, ఇద్దరు మగపిల్లలు సాయికుమార్, సోమశేఖర్ ఉన్నారు.
Latest News