|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:27 PM
కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలో వైసీపీ, టీడీపీల ఫ్లెక్సీ వార్ సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ సర్కిల్‌లో థ్యాంక్యు జగన్ పేరిట కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు నందిగామ డీఎస్పీకి ఫోన్‌లోనే ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య తెచ్చే ప్రయత్నం జరుగుతుందని, వెంటనే ఫ్లెక్సీని తొలగించాలని, లేని పక్షంలో తామే తొలస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే టీడీపీ అభిమానులు బంగారపు కొట్ల సెంటర్‌లో ఖైదీ నెం.6093 పేరుతో జగన్ ఫోటోతో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వీటిని దృష్టిలోకి తీసుకున్న పోలీసులు రెండు ఫ్లెక్సీలను తీసేయించారు.
Latest News