భార్యని చంపిన భర్త
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:26 PM

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామంలో ఘోర సంఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్ళితే..... గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్న పల్లె లావణ్య (45)ను ఆమె భర్త జయ రాముడు హత్య చేశాడు. వీరిరువురు నంద్యాల జిల్లా ఉయ్యాల వాడ మండలం సర్వాయిపల్లె గ్రామం నుంచి రెండేళ్ల క్రితం ముండ్లపాడుకు వచ్చారు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పలు కారణాలతో తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఆదివారం రాత్రి కూడా గొడవ పడ్డారు. రాత్రి పడుకుని ఉన్న సమయంలో భర్త ఇనుప రాడ్డుతో భార్య పై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. అయితే పడుకొని ఉన్నట్లు లావణ్య ను ఉంచడంతో తెల్లవారుజామున కూతురు తల్లి పలుకడం లేదని ఇరుగుపొరుగు వారికి తెలిపింది. ఇరుగుపొరుగు వారు గమనించి లావణ్య మృతి చెందినట్లు తెలుసుకున్నారు. లావణ్య తండ్రి రత్నగోపాల్‌నాయుడుకు సమా చారం ఇవ్వగా సోమవారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అల్లుడు జయ రాముడే కూతురు లావణ్యను హత్య చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలుపడంతో కేసు నమోదు చేశారు. 

Latest News
Bihar CM Samrat Choudhary welcomes Vietnam Prez To Lam in Gayaji Tue, May 05, 2026, 01:02 PM
'Fatherhood helped my cricket over the last year': KL Rahul Tue, May 05, 2026, 12:50 PM
WHO confirms 2nd hantavirus case on Dutch cruise ship Tue, May 05, 2026, 12:27 PM
Humanitarians warn of lack of prosthetic care in Gaza Tue, May 05, 2026, 12:12 PM
From World Cup highs to IPL woes: Mumbai Indians' slide exposes cracks in star core Tue, May 05, 2026, 12:02 PM