|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:27 PM
ఉమ్మడి అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలంలోని ప్రశాంతి గ్రామంలో యువకుడి మరణం విషాధచాయలు నింపాయి. వివరాల్లోకి వెళ్ళితే..... అమడగూరు మండలం కొట్టువారిపల్లికి చెందిన సురేంద్రనాయక్ (27) ఎనిమిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం పుట్టపర్తికి వచ్చి ఆటో (టాటాఏ్‌స)నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఈదశలో ఆటో కొనుగోలుకు అప్పులు చేసి తీర్చలేక ఇబ్బంది పడుతుండేవాడు. అలాగేమరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో మనస్థాపం చెంది సోమవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Latest News