|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:40 PM
అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు పవన్ మద్దతు ఇస్తున్నారు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్ మాట్లాడటం నిజం కాదా? ప్యాకేజీ కోసమే చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. షెల్ కంపెనీల్లో పవన్‌కు కూడా వాటా ఉన్నట్టుంది. త్వరలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా అరెస్టు అవుతారు. స్కిల్ డెవల్‌పమెంట్ వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా విచారణ జరుగుతుంది. గతంలో జగన్‌ను జైలు రెడ్డి అని పిలిచారు... ఇప్పుడు చంద్రబాబును జైలు చౌదరి అని పిలవాలా..? అని రోజా ప్రశ్నించారు.
Latest News