|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:32 PM
ప్రజా ఉద్యమాలు, ప్రతిపక్ష నేతల పర్యటనల సందర్భంగా పోలీసుల దుందుడుకు తీరును నిరసిస్తూ సీపీఐ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో అఖిలపక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు హాజరై విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు.
Latest News