|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:57 AM
పొన్నూరు పట్టణంలో వీధి కుక్కలు సంచారం ఎక్కువైపోవడం వలన ఆయా వార్డుల్లో ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా వీధులలో సంచరిస్తూ మనుషులను కరిచేందుకు తెగబడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంగళవారం విద్యానగర్ వీధులలో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు సంచరించటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. మున్సిపల్ అధికారులు వీటిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Latest News