వైష్ణవ్ తేజ్-శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మూవీని చూసిన అభిమానులు ట్విట్టర్ వేదిక తమ అభిప్రాయాలకు చెప్పుకొస్తున్నారు.
సినిమా ఫస్టాఫ్‌లో కామెడీ బాగుందని, సెకండాఫ్‌లో శ్రీలీల-వైష్ణవ్ యాక్షన్ సీన్లు అదిరిపోయాయంటూ కామెంట్లు చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు. శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసిందన్నారు.