ఇప్పటి వరకు టాప్ 1లో ఉన్న శివాజీ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇన్నాళ్లు నెగిటివిటీని దాచుకున్న అమర్‌దీప్‌లా టాప్ ఓటింగ్‌తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నాడు. ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ ప్రియాంక తప్ప మిగతా హౌస్‌మేట్స్ అందరూ ఉన్నారు. అయితే ఈ రెండు వారాలుగా అమర్‌దీప్‌కి పాజిటివ్ ఫుటేజీ వస్తోంది. అంతేకాదు ఫ్యామిలీ వీక్ తర్వాత అమర్ తన ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. దీంతో ఇప్పుడు టైటిల్ రేసులో ముందున్నాడు.
తాజా లెక్కల ప్రకారం.. అమర్ దీప్.. 31.1% ఓటింగ్ శాతంతో నంబర్ వన్ ర్యాంక్ సాధిస్తుండగా.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ 23.97%తో రెండో స్థానంలో ఉండగా.. శివాజీ ఓటింగ్ సగానికి పైగా పడిపోయింది. కేవలం 15.19% ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు. ఇక డాక్టర్ బాబు శుక్రవారం ఉదయం వరకు 10.99% ఓట్లు సాధించి నాలుగో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 10.95% స్వల్ప తేడాతో యావర్ ఐదో స్థానంలో ఉండగా, 3.39% ఓటింగ్‌తో రతిక ఆరో స్థానంలో ఉన్నారు. ఇక అర్జున్ 3.26% ఓటింగ్‌తో ఏడో స్థానంలో ఉండగా, చివరగా 1.11% ఓటింగ్‌తో అశ్విని చివరి స్థానంలో ఉన్నారు. మొత్తం రెండు వారాల ఆటతో అమర్‌దీప్ టైటిల్ రేసులో ముందంజలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa