స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో పోలీసు అధికారి భన్వర్ సింగ్ షెకావత్‌గా నటించిన ఫాహద్ ఫాసిల్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ ఫాహద్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ విషెస్ తెలియజేస్తూ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది.
సెకండ్ పార్ట్ లో కూడా ఆయన అలరిస్తారు అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. రిలీజైన పోస్టర్ స్టైలిష్ గా ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa