కొత్త దర్శకుడు రాజేష్ దొండపాటి దర్శకత్వంలో నూతన హీరో హీరోయిన్లు రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం "కృష్ణగాడు అంటే ఒక రేంజ్". ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే టీజర్ విడుదలయ్యింది. టీజర్ ను బట్టి ఈ సినిమా ఒక విలేజ్ లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందిందని తెలుస్తుంది. టీజర్ ఆసక్తికరంగా, చాలా సహజంగా సాగింది.శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పెట్ల కృష్ణమూర్తి, పెట్ల వెంకట సుబ్బమ్మ, PNK శ్రీలత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa