ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : 'భీష్మ' కాంబోలో మరొక న్యూ మూవీ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 05:59 PM

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా, 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల రూపొందించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం 'భీష్మ'. 2020లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించింది.


'భీష్మ' త్రయం మరొకసారి కలవబోతుందని, వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మండన్నా జంటగా మరొక క్రేజీ మూవీ రూపొందబోతుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కాంబోలో మూవీ నిజంగానే పట్టాలెక్కబోతుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa