సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న NBK 108 గతేడాదిలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించగా, తారకరత్న మరణం కారణంగా కొంత బ్రేక్ తీసుకుని, ఈ నెలలోనే తిరిగి పట్టాలెక్కింది. శ్రీలీల కీరోల్ లో నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
తాజా న్యూస్ ప్రకారం, ఉగాది కానుకగా రేపు బాలకృష్ణ లుక్ రివీల్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి, మేకర్స్ నుండైతే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. రేపు ఒకేసారి అభిమానులకు సర్ప్రైజ్ అందిస్తారేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa