యంగ్ హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా దర్శకురాలు బీవీ నందినీ రెడ్డి రూపొందించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "అన్నీ మంచి శకునములే". తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. 'అన్నీ మంచి శకునములే అనుకొని సాగితే' అని సాగే ఈ సూథింగ్ మెలోడీని సింగర్ కార్తీక్ ఆలపించారు. రెహమాన్ లిరిక్స్ అందించారు. మిక్కీ జే మేయర్ స్వరపరిచారు.
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకీ, వెన్నెల కిషోర్ కీరోల్స్ లో నటించారు. స్వప్న సినిమా, మిత్రవింద మూవీస్ సంయుక్త బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa