సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా "NBK 108" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఐతే, ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా చాలా మంది హీరోయిన్లుగా పేర్లు వినబడగా, ఆఖరికి ఆ అవకాశం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి దక్కినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు NBK 108 చిత్రబృందం కాజల్ కి వెల్కమ్ ఆన్ బోర్డ్ పలుకుతూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa